
Venkatesh-Trivikram’s AK47 Teaser Out: Family Fun Takes a Mass Action Turn
Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam House No: 47 – AK47 teaser is out, blending family comedy with action. The film releases on October 2.
వెంకటేష్ ‘ఏకే47’ టీజర్ విడుదల.. ఫ్యామిలీ కామెడీతో పాటు యాక్షన్!
విక్టరీ వెంకటేష్–త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 – ఏకే47’ అధికారిక టీజర్ విడుదలైంది. వెంకటేష్ 77వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ తొలిసారి దర్శకత్వం వహిస్తున్నారు. ‘పర్ఫెక్ట్గా అసంపూర్ణమైన కుటుంబం’ అంటూ మేకర్స్ టీజర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
మధ్యతరగతి కుటుంబానికి చెందిన చిట్టిబాబు పాత్రలో వెంకటేష్ కనిపించారు. అప్పులు, ఇంటి ఖర్చులు, రోజువారీ సమస్యలతో సరదాగా సాగే కుటుంబ జీవితం.. లాటరీ గెలిచిన తర్వాత గేటెడ్ కమ్యూనిటీకి మారడంతో మరో మలుపు తీసుకుంటుంది. అక్కడ గూండాల ముఠాతో చిట్టిబాబు కుటుంబం తలపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ముఠా ఎవరు? కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేసింది? అనే విషయాలను టీజర్లో వెల్లడించలేదు.
వెంకటేష్ సరదా నటన, త్రివిక్రమ్ డైలాగ్స్, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో పాటు యాక్షన్ సన్నివేశాలు టీజర్లో ఆకట్టుకున్నాయి. సినిమాలో శ్రీనిధి శెట్టి స్వర్ణ పాత్రలో నటిస్తుండగా, యువినా పార్థవి, రాజా ప్రాజ్వల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నారా రోహిత్, నివేదా పేతురాజ్, రావు రమేష్, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
గతంలో ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ చిత్రాలకు త్రివిక్రమ్ మాటలు అందించారు. ఇప్పుడు తొలిసారి వెంకటేష్కు దర్శకత్వం వహిస్తున్నారు. హారిక & హాసిని క్రియేషన్స్పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.



