Latest3 రోజుల్లో రెండుసార్లు బొత్స సత్యనారాయణ కంటతడి
విజయనగరం జిల్లా వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో బొత్స సత్యనారాయణ మరోసారి భావోద్వేగానికి గురయ్యారు. గుడివాడ అమర్నాథ్ ప్రసంగంలో మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను టీడీపీలో చేరిన అంశం ప్రస్తావనకు రావడంతో ఆయన కంటతడి పెట్టుకున్నారు. సెప్టెంబర్ 10న గరివిడి–చీపురుపల్లి సమావేశంలోనూ బొత్స ఇదే అంశంపై కన్నీళ్లు పెట్టుకున్నారు. సెప్టెంబర్ 8న చిన్న శ్రీను వైసీపీని వీడి టీడీపీలో చేరిన తర్వాత 3 రోజుల వ్యవధిలో బొత్స 2 పార్టీ సమావేశాల్లో భావోద్వేగానికి గురయ్యారు.

